
TVS Sport ES Plus: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ బడ్జెట్ సెగ్మెంట్‌లో తమ శ్రేణిని విస్తరించింది. ఇప్పటికే అత్యధిక అమ్మకాలు, తక్కువ ధరలతో వినియోగదారుల మన్ననలు పొందిన TVS స్పోర్ట్ మోడల్‌లోకి తాజాగా ES+ వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో టీవీఎస్ మోటార్ అందించే అత్యంత తక్కువ ధర గల మోటార్ సైకిల్‌గా TVS Sport గుర్తింపు పొందింది. ఇది TVS Star City+, TVS Raider 125 మోడళ్ల కన్నా తక్కువ ధరకు లభిస్తుంది. తాజాగా విడుదలైన ES+ వేరియంట్ ధర కేవలం రూ. 60,881 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించబడింది. ఇక ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న TVS స్పోర్ట్ ES వేరియంట్ ధర రూ. 59,881 కాగా, ఇది తక్కువ ధరకు అందుబాటులో ఉండి కూడా అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. టాప్ ఎండ్ మోడల్ అయిన ELS వేరియంట్ ధర రూ. 71,785 గా ఉంది.
Read Also: Pochampally: పోచంపల్లిని సందర్శించనున్న మిస్ వరల్డ్ 2025 పోటీదారులు..!
ఇక కొత్తగా వచ్చిన ES+ వేరియంట్ కు గ్రే రెడ్ (Grey Red), బ్లాక్ నియన్ (Black Neon) అనే రెండు రంగుల ఎంపికలు ఉన్నాయి. ఈ రంగులలోని బైకులకు ఫ్యూయల్ ట్యాంక్, హెడ్‌లైట్ కవర్, ముందు మడ్‌గార్డ్ అలాగే సైడ్ ప్యానెల్స్‌పై ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్‌పై ‘110’ మార్కింగ్ ద్వారా బైక్ ఇంజిన్ సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఈ వేరియంట్‌లో బ్లాక్ కలర్ గ్రాబ్ రైల్ ఉంటుంది. ఇది మిగతా వేరియంట్లలో ఉండే సిల్వర్ గ్రాబ్ రైల్ కు భిన్నంగా ఉంటుంది. అలాగే కలర్డ్ రిమ్స్ తో కూడిన అలాయ్ వీల్స్ ఈ వేరియంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది మిగిలిన మోడళ్లలో లభించదు. TVS మోటార్ కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తన ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తోంది. దేశీయ విక్రయ వ్యూహానికి తోడుగా, ఈ అంతర్జాతీయ విస్తరణ ద్వారా కంపెనీ తన మార్కెట్ ఆధారాన్ని పెంచుతోంది.
Read Also: IPL 2025: లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీకి మరో షాక్ తప్పదా?
ఈ కొత్త ES+ వేరియంట్ విడుదల చేయడం ద్వారా బడ్జెట్ పరంగా ఆలోచించే వినియోగదారులకు నాణ్యత గల ఎంపికను అందించడమే TVS మోటార్ లక్ష్యంగా పెట్టుకుంది. డైలీ యూజ్ కోసం విశ్వసనీయత కలిగిన TVS Sport బైక్ మోడల్‌ను మరింత మందికి చేరవేయాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వాహనం ధర తక్కువ, మన్నికైన పనితీరు ఇంకా ఆకర్షణీయమైన డిజైన్ కలగలిపి రోజువారీ ప్రయాణికులకు ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. ES+ వేరియంట్‌తో ఈ సక్సెస్ మరింత ముందుకు సాగనుందని ఆశిస్తున్నారు.