
అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌కి 22వ సినిమా కాగా, అట్లీకి ఇది ఆరవ సినిమా కానుంది. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఉండడంతో ఇటీవల విఎఫ్ఎక్స్ స్టూడియోకి వెళ్లి, అక్కడ నుంచే ఒక వీడియో రిలీజ్ చేసి సినిమాని అనౌన్స్ చేసింది సినిమా టీం. ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్‌ని ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు అట్లీ.
Pahalgam Terror Attack: పహల్గామ్ అటాక్.. చిక్కుల్లో ప్రభాస్ హీరోయిన్?
56 ఏళ్ల విల్ స్మిత్ అమెరికన్ యాక్టర్, అలాగే నిర్మాత కూడా. అతను గోల్డెన్ గ్లోబ్, గ్రామీ సహా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా. ఇండియాలో కూడా అద్భుతమైన హిట్లుగా నిలిచిన మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ సహా ఎన్నో సినిమాల్లో ఆయన నటించాడు. ప్రస్తుతానికి చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న విల్ స్మిత్‌ని ఒప్పించేందుకు టీం అయితే గట్టిగానే కష్టపడుతోంది. అయితే అది ఎంతవరకు నిజమవుతుందో అనే విషయం మీద మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.