
* నేడు తెలంగాణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన.. 285 కి.మీ మేర జాతీయ రహదారుల ప్రారంభోత్సం.. కాగజ్ నగర్ లో హైవేకు శంకుస్థాపన చేయనున్న గడ్కరీ.. బీహెచ్ఈఎల్, అంబర్ పేట్ ఫ్లైఓవర్ల ప్రారంభోత్సం.. నేటి సాయంత్రం అంబర్ పేట్ లో నితిన్ గడ్కరీ సభ..
* నేటి నుంచి 28 మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు.. 20వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం.. ప్రతి జిల్లాకు ఒక మండలం చొప్పున సదస్సులు.. భూభారతిపై ప్రజల్లో అవగాహన కల్పించడం.. భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించనున్న సర్కార్.. రైతుల సందేహాలను నివృతి చేయనున్న కలెక్టర్లు..
* నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీలు.. రాష్ట్రంలోని తహసీల్దార్, జిల్లా కలెక్టర్ లకు బీజేపీ వినతి పత్రాలు.. పాకిస్తాన్ పౌరులను పంపించేయాలని కోరనున్న బీజేపీ నేతలు..
* నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం.. తాగునీటి అవసరాలపై స్పష్టత ఇచ్చే అవకాశం.. రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన బోర్డు.. నీటి వినియోగంపై గణాంకాలతో సహా సిద్ధమైన తెలంగాణ.. అదనంగా మరో 10 టీఎంసీల నీటిని అడుగుతున్న ఏపీ..
* నేడు ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్భార్..
* నేడు కాకినాడ కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష.. కాకినాడ, తూ.గో, కోనసీమ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నాదెండ్ల సమావేశం.. అకాల వర్షాలు, రైతుల ఇబ్బందులు, ధాన్యం కొనుగోలుపై చర్చ..
* నేడు సీఐడీ విచారణకు విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా.. నటి జత్వానీని వేధించిన కేసులో విచారించనున్న సీఐడీ..
* నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు.. మరో రెండు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు..
* నేడు తెలంగాణ హైకోర్టు జడ్జి ప్రియదర్శని అంత్యక్రియలు.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు..
* నేడు వక్ఫ్ చట్టం చట్టబద్దతపై సుప్రీంకోర్టులో విచారణ.. విచారణ జరపనున్న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం..
* నేడు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్..