Navy Officer Vinay Narwal Last Video Shows Him Dancing With His Wife In Pahalgam Terror Attack

పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉగ్రమూకల దాడిలో చనిపోక ముందు భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హనీమూన్‌లో భాగంగా పహల్గామ్‌లో భార్యతో కలిసి చాలా ఎంజాయ్‌గా గడిపాడు. ఇక వారిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ అదరహో అన్నట్టుగా ఉంది. అంత చూడముచ్చటగా జంట కనిపించింది. కానీ అంతలోనే మృత్యువు పగ బట్టింది. ఉగ్రమూకలు దయాదాక్షిణ్యం లేకుండా తూటాలు కురిపించడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: నా పేరు భరత్.. నేను హిందువుని అనగానే తూటాల వర్షం.. బెంగళూరు టెక్కీ విషాదగాధ

వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నేవీలో చేరి కొచ్చిలో పోస్టింగ్ పొందారు. 2025, ఏప్రిల్ 16న వివాహం జరిగింది. ఇక ఏప్రిల్ 19న గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బంధువులు, స్నేహితులు, అధికారులంతా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జంట హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారు. వచ్చిన బంధువులంతా ఇళ్లకు వెళ్లారు. ఇంతలోనే చావు కబురు అందింది. ముష్కరుల దాడిలో వినయ్ నర్వాల్ చనిపోయినట్లుగా సమాచారం అందింది. అందరూ దు:ఖంలో మునిగిపోయారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న అధికారిని పొట్టనపెట్టుకున్నారని స్థానికులంతా వాపోయారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by Ntvtelugu website. This website is not to be held responsible for any of the content displayed.