
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడు, ఇప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అప్పట్లో ఆయన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఏ స్థాయిలో వచ్చేవారో తెలిసిందే. అలా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చిన మూవీల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి కూడా ఉంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో రికార్డులు కొల్లగొట్టింది. చిరంజీవి, శ్రీదేవి గ్రేస్ చూడటానికి ఇరువురి ఫ్యాన్స్ థియేటర్లకు ఎగబడ్డారు. మే 9, 1990లో దీన్ని రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సినిమా కోసం ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వెళ్లారు. అయితే మూవీ టికెట్లు కూడా దొరకని పరిస్థితులు చాలా థియేటర్ల వద్ద కనిపించింది.
Read Also : Breakup Benefits: బ్రేకప్ వల్ల కలిగే లాభాల గురించి తెలుసా?
దీంతో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున బ్లాక్ లో కొనేందుకు ప్రయత్నాలు జరిగాయి. వాస్తవానికి మూవీ టికెట్ ధర రూ.6 మాత్రమే. కానీ దీన్ని రూ.210 పెట్టి మరీ కొనేశారు. అంటే దాదాపు 35 రెట్లు ఎక్కువ. అప్పట్లో ఇదో సెన్సేషన్ అయిపోయింది. చిరంజీవి క్రేజ్ ను ఈ న్యూస్ అప్పట్లో బాగా ట్రెండ్ చేసింది. ఈ మూవీ వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా దీన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అప్పటి న్యూస్ మరోసారి వైరల్ అవుతోంది. ఈ మూవీని అశ్వినీ దత్ నిర్మించగా.. భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని మెగాస్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
Read Also : Samantha- Saipallavi : సాయిపల్లవి, సమంతపై దారుణంగా ట్రోల్స్.. ఎందుకంటే..?