
Gopichand Malineni : ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. తెలుగు డైరెక్టర్లు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇతర భాషల డైరెక్టర్లతో మన హీరోలు పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో తెలుగు డైరెక్టర్ మాత్రం.. తనను వేరే భాష హీరో కావాలనే సైడ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనే హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఆయన రీసెంట్ గానే జాట్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తనను తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా నుంచి తప్పించారంటూ సంచలన కామెంట్లు చేశాడు. బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా తర్వాత తనకు విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందన్నాడు.
Read Also : MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. కోహ్లీకి కూడా సాధ్యం కాలే!
‘తమిళ దళపతి విజయ్ తో నేను సినిమా చేయాలనుకున్నా. కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. వెంటనే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. కానీ ఆ మూవీ తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి తెలుగు డైరెక్టర్ తో కాకుండా తమిళ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఆయన ఫ్యాన్స్, సన్నిహితుల నుంచి ఆయనపై ఒత్తిడి వచ్చింది. అప్పటికే వారసుడు సినిమాతో తెలుగు డైరెక్టర్ మూవీలో యాక్ట్ చేశాడు. కాబట్టి మళ్లీ నాతో చేస్తే అందరూ తెలుగు వారే అవుతారు.. బాగోదని కొందరు చెప్పడంతో చివరి నిముషంలో నన్ను తప్పించారు. నేను తెలుగు వాడిని అయినందుకే వద్దన్నారు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు గోపీచంద్.
Read Also :Samantha- Saipallavi : సాయిపల్లవి, సమంతపై దారుణంగా ట్రోల్స్.. ఎందుకంటే..?