Houthi Ballistic Missile Strikes Near Israels Biggest Airport

Viral Video: హౌతీ ఉగ్రవాదులు ఆదివారం రోజు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సై్ల్‌తో దాడి చేశారు. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి మిస్సైల్‌ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్‌ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read Also: India Pakistan Tension: పాక్ ఆర్మీ జనరల్స్, మంత్రులు పారిపోయేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు..

ఇజ్రాయిల్‌కి ఉన్న బలమైన 4 అంచెల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని దాటి క్షిపణి దాడి జరగడం సంచలనంగా మారింది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో కనీసం 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు.

క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిపై ఏడు రెట్లు అధిక దాడి చేస్తామని అన్నారు. మరోవైపు, ఈ దాడిని హౌతీ నాయకులు ప్రశంసించారు. సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని అభినందించారు. ఇజ్రాయిల్‌‌తో ఘర్షణలో తమకు ఎలాంటి రెడ్‌లైన్స్ లేవని, ఇజ్రాయిల్ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని హౌతీ సీనియర్ అధికారి మొహమ్మద్ అల్-బుఖైతి అల్-అరబీ టీవీకి తెలిపారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by Ntvtelugu website. This website is not to be held responsible for any of the content displayed.