Harish Rao Hits Out At Congress Government

Harish Rao : ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. డిగ్రీ స్టూడెంట్లకు ఇంకా ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్లు దోచిపెట్టారని.. కానీ స్టూడెంట్లకు మాత్రం ఫీజు రీయంబర్స్ మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. డిగ్రీ స్టూడెంట్లకు రూ.800 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా 6 లక్షల మంది స్టూడెంట్ల జీవితాలను అగమ్య గోచరంగా మార్చేసిందన్నారు.
Read Also : Vijay Sethupathi : ‘తలైవన్ తలైవి’ టైటిల్ టీజర్ రిలీజ్..!

‘డిగ్రీ ఎగ్జామ్స్ టైమ్ కు నిర్వహించకపోవడంతో.. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లా సెట్, పీజీసెట్, ఇతర సెట్ ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు. ఏప్రిల్ లోనే ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల స్టూడెంట్లు, యాజమాన్యాలు తీవ్రమైన నిరసన తెలుపుతున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు. బీఆర్ ఎస్ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రీయంబర్స్ మెంట్ ఆపలేదు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే స్టూడెంట్లను ఇబ్బందుల్లో పడేసింది. డిగ్రీ అడ్మిషన్లు నిలిపేసి కాలేజీలకు తాళం వేసే పరిస్థితి తీసుకొచ్చింది. 17 నెలల్లో 17 పైసలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా.. స్టూడెంట్ల జీవితాలకు అతీగతీ లేకుండా పోతోంది. మొన్న అసెంబ్లీలో ఫీజు రీయంబర్స్ మెంట్లు త్వరలోనే ఇస్తామని రేవంత్ ప్రకటించినా.. ఇప్పటికీ అమలు కావట్లేదు. పాలన చేతకాక విద్యార్థులతో ఆడుకుంటే ఊరుకునేది లేదు’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు హరీష్‌ రావు.
Read Also : Chiranjeevi : ‘విశ్వంభర’ నుంచి త్రిష లుక్ రివిల్.. !

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by Ntvtelugu website. This website is not to be held responsible for any of the content displayed.