
Damodara Raja Narasimha : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, వర్గపోరు లాంటివి సహజమని, కానీ అవి పార్టీకి నష్టం కలిగించకూడదని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే చాలాసేపు పడుతుందని, మన పార్టీ బలమే స్వేచ్ఛ, అదే బలహీనత కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో సంభవించిన గందరగోళ పరిస్థితులపై స్పందించిన దామోదర్ రాజనర్సింహ, అక్కడ ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నా కూడా వివాదం చోటు చేసుకోవడం బాధ కలిగించిందని అన్నారు. ఇలాంటి గొడవలపై బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మాకు ఉందని, మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థతులు జరిగితే, వాటిని సద్దుమణిగేలా చూస్తామని ఆయన తెలిపారు.
IPL 2025: డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ గుజరాత్ టైటాన్స్ ఆటగాడు!
పార్టీలో వర్గాలు, అసంతృప్తులు ఉండటం సాధారణమేనని వ్యాఖ్యానించిన ఆయన, సమన్వయం అనేది అత్యంత కీలకమని, రాజకీయాల్లో బేధాలు ఉండొచ్చు, కానీ అవి పార్టీకి హానికరంగా మారకూడదు అని హితవు పలికారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కుల గణన నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అదేవిధంగా, మేమందరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యులమని, ఆయన్ని ప్రతి రోజు గుర్తు చేసుకుంటామని ఆయన భావోద్వేగంగా తెలిపారు.
Bandi Sanjay: ఆపరేషన్ కగార్ ఆగదు… మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందే.. లొంగిపోవాల్సిందే