
Punjab: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఉద్రిక్తతల నడుమ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులు దొరికారు. ఆర్మీ కంటోన్మెంట్, వైమానిక స్థావరాల సున్నితమైన సమాచారం, ఫోటోలను లీక్ చేయడంలో వీరి పాత్రకు సంబంధించి పంజాబ్ పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు.
Read Also: Greg Abel: వారెన్ బఫెట్ వారసుడిగా ‘గ్రెగ్ అబెల్’.. లక్షల కోట్ల కంపెనీకి కొత్త సీఈఓగా బాధ్యతలు!
ఇద్దరు వ్యక్తుల్ని పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మాసిహ్‌గా గుర్తించారు. పంజాబ్ డీజీపీ తన ఎక్స్ ఖాతాలో..‘‘ ఇద్దరు నిందితులు అమృత్‌సర్ సెంట్రల్ జైలులో ఉన్న హర్ ప్రీత్ సింగ్, అలియాస్ పిట్టు మరియు అలియాస్ హ్యాపీ ద్వారా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారిని శనివారం అరెస్టు చేశాము. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయబడింది, దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు ముమ్మరం అయ్యే కొద్దీ మరిన్ని కీలక విషయాలు వెల్లడవుతాయని భావిస్తున్నాము’’ అని అన్నారు.
పంజాబ్ పోలీసులు, భారత సైన్యంతో ఉన్నారని, జాతీయ ప్రయోజనాలను కాపాడే బాధ్యతలో స్థిరంగా ఉన్నామని, మన సాయుధ దళాల భద్రతను దెబ్బతీసే ఏ ప్రయత్నం చేసినా తక్షణ చర్యలు తీసుకుంటామని డీజీపీ అన్నారు.