
Vijayawada: విజయవాడలోని ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలలు బయటకు వచ్చాయి. అయితే, రోజూ రాత్రిపూట తన బైక్ పై ఓ మహిళను వెంటబెట్టుకుని ఆఫీస్ కి వచ్చేవారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా అభ్యంతరం చెప్పే అవకాశం లేదు. ఇక, ఆ ఎంప్లాయ్ బైక్ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్లి అర్థగంట తర్వాత బయటకు వచ్చి తిరిగి వెళ్లిపోయేవారు. దీంతో రోజూ ఆయన రాత్రి సమయంలోనే ఓ మహిళను తీసుకు వస్తుండటంతో ఈ విషయాన్ని ఏపీటీడీసీ అధికారుల దృష్టికి సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్లారు.
ఇక, అసలేం జరుగుతుందో తెలుసుకోవటానికి అధికారులు సీసీ ఫుటేజీని చూశారు. దీంతో, ఆ ఉద్యోగి అసలు బాగోతం బయటపడింది. కాగా, డివిజన్ కార్యాలయంలోనే సదరు ఉద్యోగి రాసలీలలు చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అలాగే, సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటో ఆయన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవడంతో అతడి రాసలీలలను ఆయనే బయట పెట్టుకున్నట్టు అయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతుంది.