
Macherla: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా మారణాయుధాలు లభ్యం అయ్యాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో వారం రోజుల క్రితం ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. తాత్కాలికంగా వివాదం సద్దుమణిగినా రెండు వర్గాలు దాడులకు రెడీ అయ్యాయి. ఈ దాడికి సంబంధించిన సమాచారం ముందుగానే తెలుసుకున్న పోలీసులు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Read Also: NANI : హిట్ – 3వ రోజు.. హౌస్ ఫుల్స్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే.?
అయితే, ఈ కర్డెన్ సెర్చ్ లో కత్తులు, గొడ్డళ్లు, బరిసెలు, ఇనుపరాడ్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, దాడులు చేసేందుకు గోతాలలో నిల్వచేసిన రాళ్లు, కారం కలిపిన వాటర్ బాటిల్స్ కూడా హస్తగతం చేసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని గురజాల డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు.