
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు పెళ్లయిన మూడు నెలలకే నూరేళ్లు నిండాయి. పెళ్లయిన మూడునెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పూజ(24) నిన్న రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిన్నశంకరంపేట (మం) అగ్రహారంలో చోటుచేసుకుంది. తమ కూతురు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. భర్త మహేష్, అత్తమామలే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Also Read:Producers : ఆ విలక్షణ నటుడి కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
తీవ్ర ఆగ్రహానికి గురైన పూజ బంధువులు మహేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడిని అడ్డుకున్నారు. ఈ సమంయలో ఆగ్రహంతో ఉన్న పూజ బంధువులు పోలీసులు, చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.