
Anil Kumar Yadav: అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయంలో ఎన్నో గనులపై జరిమానాలు విధించారని తెలిపారు. ఇక, శోభారాణి మైన్ కు రూ. 32 కోట్ల మేర ఫైన్ విధించారు.. మైన్స్ శాఖ అధికారి నాయక్.. విచారణ చేసి ఆ గనిలో 35 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో తెలిపారు.. 7 నెలల తర్వాత లక్ష 25 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో రాశారు.. వీటిని తీసుకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.. ఈ తెల్లరాయిని తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు ఎమ్మార్వో చెబుతున్నారు.. గని కాల పరిమితి ముగిసిన తర్వాత అవి ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి.. కానీ, ఇలాంటి గనులన్నింటినీ స్వాధీనం చేసుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ ఆరోపించారు.
Read Also: Vicky : రెండు సార్లు జైలుకు వెళ్లిన విక్కికౌశల్..కారణం ఇదే !
ఇక, ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తుంటే కేసులు కట్టడం లేదు అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కూడా టిప్పర్లతో తెల్లరాయిని తీసుకు వెళుతున్నారు.. కూటమి సర్కార్ ప్రకటించిన కొత్త విధానం ప్రకారం గనుల వద్ద ఉన్న తెల్లరాయి నిల్వలను వేలం వేస్తామన్నారు.. ప్రభుత్వం వేలం వేస్తే రూ.500 కోట్ల దాకా ఆదాయం వస్తుంది.. కొన్ని గనులను అమర్ నాథ్ రెడ్డి నిర్వహిస్తున్నారు.. వీటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.. గనుల వద్ద గూండాలను పెట్టారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ లో భాగంగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారు.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.. వీటన్నిటికీ ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేమిరెడ్డి తన అనుచరులను మాట్లాడించకుండా తానే సమాధానం చెప్పాలి.. ఎవరు తెల్ల రాయి తీసినా తనకే అమ్మాలని వేమిరెడ్డి భయపెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు.
Read Also: Bandi Sanjay: ఆపరేషన్ కగార్ ఆగదు… మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందే.. లొంగిపోవాల్సిందే
కాగా, అక్రమ మైనింగ్ ను స్వయంగా వెళ్లి పరిశీలిస్తాను అని వైసీపీ నేత అనిల్ కుమార్ తెలిపారు. గన్నులన్నింటినీ ప్రారంభించక పోతే యజమానుల తరఫున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గనుల్లో అక్రమాలు చేస్తున్న ఎంపీ వేమిరెడ్డిపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను.. తన కంపెనీ కాకపోతే ఆయన ఎందుకు ఆన్సర్ ఇవ్వడం లేదు.. రూ.15 వందల కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారు.. గతంలోనే చెప్పా.. పే బ్యాక్స్ అందరికీ ఉంటాయని.. క్వార్ట్జ్ డంప్ ను వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నా.. ఇలాగే అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తే అందరికీ అవకాశం కల్పించాలి.. బడా బాబులకు మాత్రమే అవకాశం ఇవ్వడం మంచిది కాదు.. చేస్తే అందరికీ చేయాలి.. లేకుంటే ఆందోళన చేస్తానన్నారు. గనుల్లో 70 శాతం మంది బాధితులు టీడీపీ వాళ్లే ఉన్నారని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.